- నాలుగు చెరువులు ఎంపిక.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు మార్కింగ్
- చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతోపాటు బ్యూటిఫికేషన్
- సీఎస్ఆర్ కింద నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన
- ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని టార్గెట్
- తర్వాత గ్రేటర్లోని మిగిలిన చెరువులపై దృష్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువు, మాదాపూర్ లోని సున్నం చెరువు, రాజేంద్రనగర్ లోని అప్పా చెరువు, కూకట్ పల్లిలోని నల్లచెరువులను అధికారులు ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చెరువుల వద్ద కూల్చిన బిల్డింగ్స్ డెబ్రిస్ ను ప్రస్తుతం తొలగిస్తున్నారు. తర్వాత పూడిక తీసి ఎఫ్టీఎల్, బఫర్జోన్గుర్తించి ఫెన్సింగ్వేస్తారు. డెవలప్చేసేందుకు సీఎస్ఆర్(కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీ) కింద నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారు. రియల్ఎస్టేట్సంస్థలకు ఇస్తే సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే నాన్రియల్ఎస్టేట్సంస్థలకు ఇవ్వాలని చూస్తున్నారు. బ్యూటిఫికేషన్చేపట్టే సదరు కంపెనీలు చెరువు ఒడ్డున వాకర్స్ కోసం వాక్వేతోపాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పనులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేసి విడతల వారీగా మిగతా చెరువుల రూపురేఖలు మార్చడానికి హైడ్రా అధికారులు ముందుకు కదులుతున్నారు.
ఫెన్సింగ్ పనులకు నిధులు
ఇప్పటి వరకు హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే చేస్తుందని కొంతమంది అసత్యపు ప్రచారం చేయడంతో ప్రజల్లో ఆ సంస్థపై కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా.. ఇప్పటికే ఆక్రమణలను తొలగించిన చెరువుల పరిరక్షణపై ఫోకస్ పెట్టింది. ఫెన్సింగ్, ఇతర పనులు చేయించేందుకు ప్రభుత్వం ఇచ్చిన రూ.200 కోట్లను ఖర్చు చేయాలని చూస్తోంది. త్వరలో ఈ నిధులు విడుదల కానున్నాయి.
సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు
చెరువుల వద్ద లేక్ ప్రొటెక్షన్ పేరుతో ఒక్కోచోట ఇద్దరు గార్డులను ఏర్పాటు చేసేందుకు హైడ్రా ప్లాన్ చేసింది. ఇదివరకు భద్రత లేకపోవడంతోనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణలు వెలిశాయి. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులు ఉండగా, హైడ్రా పరిధిలో 565 చెరువులు ఉన్నాయి. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద పైన చెప్పిన నాలుగు చెరువుల వద్ద సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. ఒక్కోసారి గార్టులు అందుబాటులో ఉండకపోతే కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. తర్వాత గ్రేటర్ పరిధిలో అన్ని చెరువులకు విస్తరించనున్నారు. హైడ్రా పరిధిలో ఉండే మూడు రీజినల్ ఆఫీసుల్లోని ఉన్నతాధికారులకు కొన్ని చెరువుల బాధ్యతలను అప్పగించి పర్యవేక్షించేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు.
చెరువులను కాపాడితే వరద ముంపు తప్పినట్లే
చెరువులు, నాలాల పరిరక్షణకు హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్రోజూ స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధి పరిశోధకులు, నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం హైడ్రా ఆఫీసులో వాటర్, విమెన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ మన్సీబాల్ భార్గవతో సమావేశమయ్యారు. చెరువుల పునరుజ్జీవానికి తీసుకుంటున్న చర్యలను రంగనాథ్వివరించారు. హైడ్రా చర్యలపై మన్సీబాల్ భార్గవ హర్షం వ్యక్తం చేశారు. చెరువులకు పూర్వ వైభవం తెస్తే నగరానికి వరద ముప్పు తప్పుతుందని చెప్పారు. శరీరానికి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో.. సిటీకి గొలుసుకట్టు చెరువులు అంతే అవసరం అన్నారు. నాలాలు సరిగా ఉంటే వరద నీరు సాఫీగా చెరువులకు చేరుతుందన్నారు. ఇక నుంచి గొలుసు తెగకుండా చూడాలని, ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. బెంగళూరులో వరదలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయని, అలాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.