
హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారి గురించి తెలుసుకొనేందుకు హైడ్రా అధికారులు బుద్దభవన్ లో ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర వాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 59 ఫిర్యాదులు రాగా.. వాటిలో ఎక్కవుగా ప్రభుత్వ స్థలాలు, నాలా, రహదారుల అక్రమణల గురించి కంప్లయింట్ చేశారు.
- బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 లోని శ్రీ వేంకటేశ్వర కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి చెందిన 600 గజాల ఓపెన్ ప్లేస్ కబ్జా చేశారని అన్నపూర్ణ అనే మహిళ ఫిర్యాదు చేశారు.
- నాగిరెడ్డి గొలుసు కట్టు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధితోపాటు.. నాలాను, బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని యాప్రాల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫిర్యాదు
- హయత్‌నగర్ మున్సిపాలిటీ వివేకానందనగర్ కాలనీలో 25 అడుగుల రహదారిని ఆక్రమించి ఓ ఇంటిని ఇల్లు నిర్మించారని కంప్లయింట్
- కేపీహెచ్‌బీ లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్డును ఆక్రమించి చిరు వ్యాపారాల పేరిట దందాలు చేస్తున్నారని.. శాశ్వతంగా డబ్బాలు పెట్టి మొత్తం రోడ్డును ఆక్రమించేశారని స్థానికుల ఫిర్యాదు