![ఫస్ట్ ఫేజ్లో ఈ ఆరు చెరువులకు బ్యూటిఫికేషన్ .. అదిరిపోయిన 3D మోడల్ డీపీఆర్లు](https://static.v6velugu.com/uploads/2025/02/hydra-prepares-3d-dprs-for-beautification-of-six-ponds-in-greater_eI6dyiXS2m.jpg)
గ్రేటర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ,సుందరీకరణ పనులను ప్రారంభించింది హైడ్రా. మొదటి దశలో ఆరు చెరువులకు పునరుజ్జీవం కల్పించేందుకు సిద్దమైంది హైడ్రా. హెచ్ఎండీఏ నిధులతో మొదటి దశలో ఉప్పల్ పెద్ద చెరువు, బతుకమ్మ కుంట, కూకట్ పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తమ్మిడి కుంట, మాదాపూర్ సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బుమృక్ దావాల చెరువుల పునర్నిర్మాణం చేపడుతోంది.
చెరువుల రినోవేషన్ కు డీపీఆర్ ఫైనల్ చేసింది హైడ్రా. 3D మోడల్ డీపీఆర్ లు సిద్ధం చేసింది. త్రీడి రూపంలో చెరువుల మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. జూన్ లోపు ఆరు చెరువుల రినోవేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది హైడ్రా. ఈ క్రమంలో చెరువుల పునర్నిర్మాణానికి త్వరలో టెండర్ వేయనుంది. ఈ క్రమంలోనే కూకట్ పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువులో ఉన్న కలుషిత నీటిని బయటకు పంపిస్తోంది హైడ్రా.
మరో వైపు అంబర్ పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణన పనులను ఫిబ్రవరి 18న హైడ్రా మొదలు పెట్టింది. పునరుద్ధర లో భాగంగా బతుకమ్మ కుంటలో హైడ్రా పూడిక తీత పనులు చేపట్టింది.