
హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో సోమవారం బుద్ధభవన్‌లో జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు హైడ్రా అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న(వచ్చే సోమవారం) యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని, ఎవరూ హైడ్రా ఆఫీసుకు రావద్దని చెప్పారు. అలాగే హాలిడేస్కారణంగా జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్, జోనల్ఆఫీసులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, వికారాబాద్కలెక్టరేట్లలోనూ సోమవారం ప్రజావాణి జరగదని సంబంధిత అధికారులు తెలిపారు.