కుత్బుల్లాపూర్: గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల చెరువును, నాలాలను ఆక్రమించి కట్టిన విల్లాలను కూల్చడానికి హైడ్రా రంగం సిద్ధం చేసింది. దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట కత్వ చెరువు FTL స్థలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వాటిని గుర్తించిన హైడ్రా అధికారులు ఆదివారం (సెప్టెంబర్ 8న) ఉదయం కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విజయలక్ష్మి) విల్లాల కూల్చడానికి మిషనరీతోపాటు పోలీసుల బందోబస్తు తీసుకొని అక్కడికి చేరుకున్నారు.
మాదాపూర్ లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అలాగే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు.