మణికొండ పరిధిలో కిలోమీటర్ మేర నాలా కబ్జా.. తొలగిస్తున్న అధికారులు 

మణికొండ పరిధిలో కిలోమీటర్ మేర నాలా కబ్జా.. తొలగిస్తున్న అధికారులు 

HYDRA (హైడ్రా).. ఈ పేరు చెబితే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి విలాస సౌధాలు నిర్మించిన అక్రమార్కులు ప్రశాంతంగా కునుకు తీయలేకపోతున్నారు. FTL, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన  అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిదిగా హైడ్రా అధికారులు ఎక్కడిక్కడ నోటీసులు ఇస్తున్నారు. రాజకీయ నేతలైనా.. బడా బడా వ్యాపారవేత్తలైనా.. ఆఖరికి ముఖ్యమంత్రి కుటుంబీకులైనా చర్యలు తీసుకుంటున్నారు.

కిలోమీటర్ మేర నాలా కబ్జా

రంగారెడ్డి జిల్లా, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలో అక్రమార్కులు కిలోమీటర్ మేర నాలా కబ్జా చేశారు. నాలాను మట్టితో పూడ్చి భవనాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణకు గురైన నాలా ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీల సాయంతో మట్టిని‌ తొలగిస్తున్నారు. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

ALSO READ | దుర్గం చెరువులో ఇండ్లు: సత్యం రామలింగరాజు కొడుక్కి.. దుబ్బాక ఎమ్మెల్యేకు నోటీసులు