హైడ్రా DRF లోకి 357 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. వారం రోజుల పాటు శిక్షణ.. ఎంపిక ఎలాగంటే..

హైడ్రా DRF లోకి 357 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు..  వారం రోజుల పాటు శిక్షణ.. ఎంపిక ఎలాగంటే..

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ దడ పుట్టిస్తున్న హైడ్రా కొత్త ఉద్యోగుల నియామకంతో మరింత పటిష్టంగా మారుతోంది. కొత్త ఉద్యోగుల నియమాకంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే డీఆర్ఎఫ్, ఇసుక అక్రమ రవాణ తదితర అంశాలను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో మరింత మంది ఉద్యోగులను నియమించి స్పీడ్ పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

తాజాగా హైడ్రా డీఆర్ఎఫ్ లోకి 357 కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. ఈ ఉద్యోగులు అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వారం రోజుల శిక్షణ అనంతరం ఫీల్డ్ లోకి వెళ్లనున్నారు. శిక్షణ కార్యక్రమంలో హైడ్రా కమీషనర్ రంగనాథ్  పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.

హైడ్రా కమీషనర్ రంగనాథ్ కామెంట్స్:

  • హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర  కీల‌కం
  • ప్రజల అంచ‌నాలకు అనుగుణంగా ప‌నిచేయాలి
  • ప్రభుత్వ ల‌క్ష్యాలు, ప్రజల అంచ‌నాల మేర‌కు హైడ్రా ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంది
  • ప్రకృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌పుడు డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీల‌కం
  • ప్రజల ప్రాణాల‌తో పాటు.. ఆస్తి న‌ష్టాన్ని త‌గ్గించ‌డంలో డీఆర్ఎఫ్ పాత్ర ముఖ్యమైనది
  • మ‌న‌మీద ఉన్న న‌మ్మకంతోనే ప్రభుత్వం ప‌లు బాధ్యతలు అప్పగిస్తోంది
  • తాజాగా ఇసుక అక్రమ ర‌వాణాను నియంత్రించే ప‌నిని కూడా హైడ్రా కు అప్పగించింది
  • పోలీసు ప‌రీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొంద‌లేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేశాం
  • సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మిమ్ముల‌ను ఎంపిక చేయడం జరిగింది.
  • ప్రస్తుత త‌రుణంలో ఉద్యోగాల‌కు ఎంతో పోటీ ఉంది.. 
  • మీకు దొరికిన ఈ  అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ప్రతిభ క‌న‌బ‌ర్చాలి