ఆదిబట్ల మున్సిపాలిటీలో హోర్డింగ్​ల తొలగింపు

ఆదిబట్ల మున్సిపాలిటీలో హోర్డింగ్​ల తొలగింపు

ఇబ్రహీంపట్నం వెలుగు :  ఆదిబట్ల మున్సిపాలిటీలో అక్రమ హోర్డింగ్​లపై హైడ్రా కొరడా ఝళిపించింది. ఆదిబట్ల పరిధిలో మొత్తం 89 హోర్డింగ్‌లు ఉండగా, 9 హోర్డింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవు. 

దీంతో హైడ్రా రంగప్రవేశం చేసి, కార్మికులతో వాటిని శనివారం తొలగించింది.