హైడ్రా.. హైడ్రా.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో అయితే హైడ్రా పేరు హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. సర్కార్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుతోంది. తన, మన అనే భేదం లేకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడే నేలమట్టం చేస్తోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పేరు మరింత చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉండగానే.. కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా స్టేటస్ రిపోర్ట్ అందజేసింది. ఇప్పటి వరకు నేలమట్టం చేసిన అక్రమ నిర్మాణాల జాబితాతో పాటు కాపాడిన ప్రభుత్వ స్థలం ఎంత అనే వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. హైడ్రా ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ALSO READ | హైడ్రా కూల్చివేతలపై MP అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో హైడ్రా పేర్కొంది. కాంగ్రెస్ నేత పల్లంరాజు, హీరో అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. వీటితో పాటుగా చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన అక్రమ కట్టడాలను డిమాలిష్ చేసినట్లు తెలిపింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్పేట్లో సైతం పలు అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. చెరువులను అనుకుని ఉన్న అక్రమాలను తొలగించి ఇప్పటి వరకు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి తెలిపింది.