త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. హైడ్రా FM రేడియో ఛానెల్ : కమిషనర్ రంగనాథ్

త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. హైడ్రా FM రేడియో ఛానెల్ : కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీలో త్వరలోనే.. హైడ్రా పోలీస్ స్టేషన్ వస్తుందని.. అతి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2024, డిసెంబర్ 28వ తేదీ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా సంచలన విషయాలు వెల్లడించారు. ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే కాదని.. త్వరలోనే హైడ్రా FM రేడియో ఛానెల్ కూడా తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారాయన. హైడ్రా పరిధిపైనా తన వివరణ ఇచ్చారు.. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేస్తుందని.. చెరువులు, కుంటలు, నదుల పరిరక్షణే హైడ్రా లక్ష్యం అన్నారాయన.

హైడ్రా ఏర్పాటు తర్వాత.. ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం అని.. భవిష్యత్ లోనూ ఆక్రమణలు కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు కమిషనర్ రంగనాథ్. ప్రజల్లోనూ అవగాహన వచ్చిందని.. ఆస్తులు కొనుగోలు చేసే ముందే FTL, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా రాదా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు రంగనాథ్. 

Also Read :- తెలంగాణ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశం.. కారణం ఇదే..!

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతుందని.. ఔటర్ పరిధిలో వెయ్యి 25 చెరువులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించాం అని.. వీటన్నింటికీ FTL, బఫర్ జోన్ గుర్తించాల్సి ఉందని.. ఆ పని వేగంగా జరుగుతుందని వివరించారు రంగనాథ్. ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో కంప్లయింట్స్ తీసుకుంటాం అని స్పష్టం చేస్తూనే.. హైడ్రా ఎవరికీ NOC.. నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వదని తేల్చిచెప్పారు కమిషనర్. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 వేలకుపైగా కంప్లయింట్స్ వచ్చాయని.. వాటిపై విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారాయన.