హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మహా నగరంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు రంగంలోకి దిగారు. మొదటి విడతగా 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ట్రైనింగ్ పూర్తి అయిన హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు నగరంలోని ముఖ్యమైన జంక్షన్లలో బుధవారం (అక్టోబర్ 30) విధులు నిర్వహించారు.
Also Read :- ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
వాహనాల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు వాహనాల రద్దీని నియంత్రించారు. కాగా, హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ విధులతో పాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులకు కూడా హైడ్రా సహయం చేయనుంది.