
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: గ్రేటర్ చెరువుల సంరక్షణకు హైడ్రా నైట్ పెట్రోలింగ్ మొదలుపెట్టింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సిటీ శివారులోని చెరువుల వద్ద హైడ్రా, ఇరిగేషన్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహించారు. తుర్కయంజాల్ మాసబ్ చెరువు, ఇంజాపూర్ జిలావర్ ఖాన్ చెరువు, పెద్ద అంబర్ పేటలోని ఈదులకుంట చెరువుతోపాటు చిన్న చిన్న చెరువులు, నాలాల వద్ద గస్తీ కాశారు.
కొందరు అర్ధరాత్రి సమయంలో చెరువులు, బఫర్జోన్లు, ఎఫ్ టీఎల్పరిధిలో మట్టిపోసి కబ్జాకు యత్నిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో నైట్పెట్రోలింగ్చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. చెరువులను మట్టితో నింపితే కఠిన చర్యలు ఉంటాయని ఇరిగేషన్ ఏఈ వంశీ హెచ్చరించారు.
మాసబ్ చెరువు ఎఫ్టీఎల్పరిధిలో మట్టి పోసి కబ్జాకు యత్నించిన సత్యనారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు అయినట్లు తెలిపారు. నైట్పెట్రోలింగ్ రోజూ కొనసాగుతుందన్నారు. ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి, హైడ్రా సిబ్బంది తిరుపతి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.