అప్ప చెరువు 35 ఎకరాలు.. కబ్జాకు గురైంది ఎంతంటే?

అప్ప చెరువు 35 ఎకరాలు.. కబ్జాకు గురైంది ఎంతంటే?

అప్ప చెరువు ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది.  అప్పా చెరువు శాటిలైట్ మ్యాప్ ను విడుదల చేసింది . అప్ప చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో అక్రమంగా 13 షెడ్లు నిర్మించారని వెల్లడించింది.  అప్ప చెరువులో  ఆగస్టు 31 ఉదయం నుంచి అక్రమంగా నిర్మించిన షెడ్ల కూల్చివేశామని తెలిపింది. గగన్ పహాడ్ దగ్గర ఉన్న అప్ప చెరువు 35 ఎకరాల విస్తీర్ణం ఉండేదన్నారు.  అప్ప చెరువు ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అప్ప చెరువు 3 ఎకరాలను ఆక్రమించి షెడ్లు నిర్మించారు. ఆక్రమణకు గురైన అప్ప చెరువు 3 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ALSO READ | హస్మత్ పేట చెరువులో అక్రమ నిర్మాణాలు. వారం రోజుల్లో కూల్చేయాలని నోటీసులు

మైలార్ దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి  అప్ప చెరువులో 3 ఎకరాలు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో హైడ్రా అధికారులు అప్ప చెరువు ఎఫ్ టీఎల్ లో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు . 3 ఎకరాల చెరువు కబ్జాకు పాల్పడ్డట్లు   తోకల శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీని విలువ రూ. 75 కోట్లు ఉంటుందని చెప్పారు అధికారులు. దీంతో 13 భారీ కట్టడాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు.