చెరువుల్లో అర్ధరాత్రి హైడ్రా నిఘా

చెరువుల్లో అర్ధరాత్రి హైడ్రా నిఘా
  • ఉందాసాగర్, దేవునికుంటలో మట్టి నింపుతున్న 
  • ఐదు టిప్పర్లు,  జేసీబీ సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్ధరాత్రి చెరువుల్లో మట్టి నింపుతున్న లారీలను హైడ్రా పట్టుకొని కేసులు నమోదు చేసింది. బండ్లగూడ పరిధిలోని ఉందాసాగర్ చెరువులో మట్టి పోస్తున్న నాలుగు టిప్పర్లను డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు  సోమవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. 

పోసిన మట్టిని చెరువులోకి చదును చేస్తున్న జేసీబీనీ స్వాధీనం చేసుకున్నారు. వీటిని బండ్లగూడ పీఎస్​లో అప్పగించి బాధ్యులపై కేసులు పెట్టించారు. అలాగే పేట్ బషీరాబాద్ పీఎస్​పరిధిలోని దేవులపల్లి(సమర్ కుంట) చెరువులో మట్టి పోస్తున్న టిప్పర్ లారీని కూడా హైడ్రా డీఆర్ఎఫ్​బృందం సోమవారం రాత్రి పట్టుకుంది. ఈ టిప్పర్ లారీని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించి కేసులు నమోదు చేయించారు.