అమీన్​పూర్​లో హైడ్రా సర్వే

అమీన్​పూర్​లో హైడ్రా సర్వే

హైదరాబాద్ సిటీ, వెలుగు: పార్కులు, రోడ్లు క‌‌బ్జాకు గురైన‌‌ట్టు ఫిర్యాదులు రావ‌‌డంతో హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్‌‌ ఆదేశాల‌‌ మేరకు అమీన్‌‌పూర్‌‌లో మంగ‌‌ళ‌‌వారం అధికారులు స‌‌ర్వే చేపట్టారు. ఎక‌‌రాకుపైగా ఉన్న పార్క్ స్థలంతో పాటు రోడ్లను గోల్డెన్ కీ వెంచ‌‌ర్ వాళ్లు క‌‌బ్జా చేశారంటూ వెంక‌‌ట‌‌ర‌‌మ‌‌ణ కాల‌‌నీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

 ఇరు ప‌‌క్షాల వాళ్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో హైడ్రా ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. జాయింట్ డైరెక్టర్ సర్వే ఆఫీస్, హైడ్రా, హెచ్​ఎండీఏ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వేలో పాల్గొన్నారు. మొత్తం 5 స‌‌ర్వే నంబ‌‌ర్లలోని 150 ఎక‌‌రాలకు పైగా ఉన్న స్థలాన్ని స‌‌ర్వే చేశారు. వెంక‌‌ట‌‌ ర‌‌మ‌‌ణ, చ‌‌క్రపురి కాల‌‌నీల వాసులు, గోల్డెన్ కీ వెంచ‌‌ర్ నిర్వాహకులు, గ్రామస్తుల సమక్షంలో అధికారులు సర్వే నిర్వహించారు.