బెంగళూరులో హైడ్రా బృందం..చెరువుల పరిరక్షణపై అధ్యయనం

బెంగళూరులో హైడ్రా బృందం..చెరువుల పరిరక్షణపై అధ్యయనం

హైదరాబాద్: చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై అధ్యయనం చేయడానికి హైడ్రా బృందం బెంగళూర్ లో పర్యటిస్తోంది. హైడ్రా కమిషనరల్ రంగనాథ్ నేతృత్వంలో కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను హైడ్రా బృందం సందర్శించింది. 

వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే ఈ వాతావరణ కేంద్రాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు.  ముందస్తుగా వర్షం సమాచారం, ఎంత మొత్తం వర్షం పడబోతోంది, వరద ముంచెత్తే ప్రాంతలవారిని అలెర్ట్ చేయడం, ట్రాఫిక్ జామ్ అలెర్ట్, ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై అక్కడి సిబ్బంది హైడ్రా టీం కు వివరించారు.  

బెంగళూర్ మేఘసందేశం app ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మొత్తం వర్షం పడుతోంది, వరద, ట్రాఫిక్ జామ్, వడగళ్ల వాన ఇలా సమాచారం ఇస్తున్నారు. ఈ యాప్ గురించి పూర్తివివరాలు తెలిపారు అక్కడి సిబ్బంది. 

Also Read : రెండు రోజుల పాటు బెంగూరులో పర్యటన

యాప్ ను ఉపయోగింది వరద ముప్పు వున్న ప్రాంతాలను అప్రమత్తం చేయడం, వరద కాలువలు ఎంత మొత్తం నీరు వెళ్తోంది, ఎక్కడ చెత్త పేరుకుపోయింది వంటి వివరాలను అలెర్ట్ చేసే సెన్సార్ విధానంపై వివరాలు తెలుసుకున్నారు.