యువ‌‌తిని కాపాడిన సిబ్బందికి హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్‌‌ ప్రశంస

యువ‌‌తిని కాపాడిన సిబ్బందికి హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్‌‌ ప్రశంస
  • యువ‌‌తిని కాపాడిన సిబ్బందికి హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్‌‌ ప్రశంస

హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్ సాగ‌‌ర్‌‌లో మంగళవారం ఆత్మహ‌‌త్యకు య‌‌త్నించిన యువ‌‌తిని కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ మార్షల్ ఫ‌‌కృద్దీన్‌‌, స‌‌హాయ‌‌ సిబ్బంది ఎ.ర‌‌మేశ్, ఎన్‌‌ .శ్రీ‌‌నివాస్‌‌, ఎండీ ఇమాముద్దీన్‌‌, కె.కార్తీక్ కుమార్‌‌ ను హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్ అభినందించారు. సాగ‌‌ర్‌‌లోకి దిగ‌‌డానికి వీలు లేకున్నా తాళ్లతో సుర‌‌క్షితంగా తీసుకువచ్చారని ప్రశంసించారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా వ‌‌చ్చిన వ‌‌ర‌‌ద‌‌తో మూసీలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన  సిబ్బందిని కూడా ఆయన బుధవారం అభినందించారు.