హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో మూసీలో రాజపుష్ప, ఆదిత్య నిర్మాణ సంస్థలు మట్టిపోసినట్లు హైడ్రా గుర్తించింది. మూసీ లో పోసిన మట్టిని తొలగించాలని ఆ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. నార్సింగి దగ్గర మూసీ నదిలో మట్టిపోసి కబ్జా చేస్తున్నారని హైడ్రా కు స్థానికుల ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకుంది.
40 అడుగుల మూసీలో దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు రాజపుష్ప సంస్థ మట్టి పోసినట్లు గుర్తించారు. పోసిన మట్టిని తొలగించక పోతే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీంతో
వారం రోజుల్లో మట్టిని తొలగిస్తామని ఆదిత్య నిర్మాణ సంస్థ హైడ్రా అధికారులకు తెలిపింది.
ALSO READ | శంషాబాద్ లో చెరువులపై హైడ్రా ఫోకస్.. పరిశీలించిన కమిషనర్ రంగనాథ్..
అదేవిధంగా పూజ హోమ్స్ సంస్థ నెక్నంపూర్ చెరువు బఫర్ జోన్ లో మట్టి నింపని షెడ్లను వేసింది. మట్టి తీసివేసి షెడ్లను వెంటనే తొలగించాలని పూజ హోమ్స్ సంస్థ ను హైడ్రా కమిషనర్ కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. త్వరలోనే తొలగిస్తామని హైడ్రాకు తెలిపింది సంస్థ.