హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్

హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్

హైదరాబాద్: మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్, నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్స్పై జీహెచ్ఎంసీ కమిషనర్తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, మీటింగ్ తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. అయ్యప్ప సొసైటీలోని బిల్డింగ్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు వివరాలు తెలియజేశారు.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే బిల్డింగ్ కూల్చేశామని, అక్రమంగా నిర్మించిన ఈ బిల్డింగ్ను గతంలో జీహెచ్ఎంసీ పాక్షికంగా కూల్చేసిందని ఆయన గుర్తుచేశారు. అయినా పట్టించుకోకుండా, హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టారని, అయ్యప్ప సొసైటీలో చాలావరకూ అక్రమ నిర్మాణాలే ఉన్నాయని హైడ్రా కమిషనర్ వ్యాఖ్యానించడంతో అక్రమ నిర్మాణాలు కట్టుకున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది.

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపుతామని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు. అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని, వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్లో ఉంటున్నారని రంగనాథ్ వివరించారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతి రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని.. ఆయా బిల్డింగ్స్కి ఎలాంటి పర్మిషన్లు లేవని, ఫైర్ సేఫ్టీ కూడా లేదని గుర్తించినట్లు ఆయన తెలిపారు.

అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు ఇవి:
* మాదాపూర్లో కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా
* అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేసిన హైడ్రా
* అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న G+5 అంతస్తుల భవనం
* అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు
* ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్
* స్థానికుల ఫిర్యాదుతో జనవరి 4న ఫీల్డ్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్
* అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
* అయ్యప్ప సొసైటీలోని సర్వే నెంబర్ 70లో 684 గజాల ప్రభుత్వ స్థలంలో 5 అంతస్థుల అక్రమ నిర్మాణం
* భారీ పోలీసు భద్రత మధ్య అక్రమ నిర్మాణం కూల్చివేత
* కూల్చివేత సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన హైడ్రా
* అక్రమ నిర్మాణ భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండడంతో పవర్ సప్లై నిలిపివేసిన అధికారులు
* భారీ జంబో మిషన్తో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసిన హైడ్రా