HYDRAA: రోజుకు రూ.లక్ష బిజినెస్ చేసే వ్యక్తి బాధితుడిలా చెప్పుకున్నడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

HYDRAA: రోజుకు రూ.లక్ష బిజినెస్ చేసే వ్యక్తి బాధితుడిలా చెప్పుకున్నడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి దాకా అనుమతి లేని, అక్రమ నిర్మాణాలు మాత్రమే కూల్చామని హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. అర్హత లేని వాళ్లు ఇచ్చే పర్మిషన్ రిజిస్టర్ అయినా అక్రమమేనని రంగనాథ్ హెచ్చరించారు. పలుకుబడితో మేనేజ్ చేసి కట్టిన వాటినే తొలగించామని స్పష్టం చేశారు. అమీన్పూర్లో మూడుసార్లు హెచ్చరించినా మళ్లీమళ్లీ  కట్టారని రంగనాథ్ చెప్పారు. సామాన్యులు అక్రమాలు చేయరని, మేనేజ్ చేయగలమనే ధీమాతో పెద్దోళ్లే చేస్తారని ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ వివరించారు. అక్రమ అనుమతులిచ్చినవాళ్లు సస్పెండయ్యారని, రిజిస్ట్రేషన్లూ రద్దయ్యాయని తెలిపారు.

ALSO READ | ఏ వ్యక్తికీ అన్యాయం జరగనివ్వం.. మూసీ నిర్వాసితులకు దానకిషోర్ భరోసా

బ్యాంకోళ్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా లోన్లు ఇచ్చారని, అక్రమార్కులను వదిలేస్తే సిటీలో కోటి మంది మునిగే ముప్పుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. రోజుకు రూ.లక్ష బిజినెస్ చేసే వ్యక్తి బాధితుడిలా చెప్పుకున్నడని, హైడ్రా బాధితులు పేదలు కాదని, అక్రమాలు చేసినవాళ్లేనని రంగనాథ్ ఘంటాపథంగా చెప్పారు. సరైన అనుమతులు ఉంటే తాము టచ్ కూడా చేయలేదని, నోటీసులు ఇచ్చినా కూడా.. లైట్ తీసుకుని.. కూల్చాక ఇవ్వలేదంటున్నారని కూల్చివేతల అనంతరం ఆందోళనలు చేస్తున్న వారి గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం గమనార్హం.