హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులే ఫిర్యాదులు.. స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్న హైడ్రా చీఫ్​

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులే ఫిర్యాదులు.. స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్న హైడ్రా చీఫ్​
  • చెరువులు, కుంటలు, కాల్వలు, రోడ్ల కబ్జాలపై 83 ఫిర్యాదులు
  • మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి భారీ స్పందన
  • స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్న హైడ్రా చీఫ్​
  • ఉద‌‌‌‌యం 11 గంట‌‌‌‌ల నుంచి రాత్రి వ‌‌‌‌ర‌‌‌‌కూ స్వీక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌
  • మూడు వారాల్లో పరిష్కరిస్తామని హామీ

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: గ్రేటర్ ​పరిధిలో చెరువులు, పార్కులు, రోడ్ల క‌‌‌‌బ్జాపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సామాన్యులే కాకుండా ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులు, ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజ‌‌‌‌కీయ నాయ‌‌‌‌కులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చి కంప్లయింట్​చేశారు. మొదటిసారిగా సోమవారం బుద్ధభ‌‌‌‌వ‌‌‌‌న్‌‌‌‌లోని హైడ్రా ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 83 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం 11 గంట‌‌‌‌లకు  మొద‌‌‌‌లైన ఫిర్యాదుల స్వీకరణ రాత్రి వ‌‌‌‌ర‌‌‌‌కూ కొనసాగింది.

హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్ స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్నారు. ముందుగా హైడ్రా ఆఫీసుకు వ‌‌‌‌చ్చిన వారికి టోకెన్లు ఇచ్చి విజిటింగ్ రూంలో కూర్చోబెట్టారు. తర్వాత క్రమంలో ఫిర్యాదులను తీసుకున్నారు. స‌‌‌‌మ‌‌‌‌స్య ఏమిటి? ఏ ప్రాంతానిది? వంటి వివరాలు తెలుసుకున్నారు. అప్పటికప్పుడే స్థానిక అధికారుల‌‌‌‌తో మాట్లాడి స‌‌‌‌మ‌‌‌‌స్యను వివ‌‌‌‌రించి ప‌‌‌‌రిష్కారానికి చ‌‌‌‌ర్యలు తీసుకోవాలని కమిషనర్​ రంగనాథ్​ ఆదేశించారు. ఔట‌‌‌‌ర్ రింగ్​రోడ్డు పరిధి దాటి ఇత‌‌‌‌ర జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు రాగా త‌‌‌‌మ ప‌‌‌‌రిధిలో లేద‌‌‌‌ని చెప్పి పంపించివేశారు.

హైడ్రా పరిధిలో లేని శాఖలపై కూడా..
హైడ్రా ప‌‌‌‌రిధిలోని ఫిర్యాదులే కాకుండా ఇత‌‌‌‌ర శాఖ‌‌‌‌ల‌‌‌‌కు చెందిన స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌పై కూడా పెద్ద సంఖ్యలు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయా డిపార్ట్​మెంట్ల అధినేతలకు అంద‌‌‌‌జేయాలంటూ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఫిర్యాదుదారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదుపై హైడ్రా ఆఫీసులో అధికారుల‌‌‌‌తో చ‌‌‌‌ర్చించి..ఆయా ఫిర్యాదులు ఎవ‌‌‌‌రి ప‌‌‌‌రిధిలో ఉంటే వారికి అంద‌‌‌‌జేసి..వారం రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు నేరుగా ఫీల్డ్​లెవెల్ లోకి వెళ్లి పరిశీలిస్తారని, మూడు వారాల్లో స్పంద‌‌‌‌న ఉంటుందని హైడ్రా చీఫ్​ హామీ ఇచ్చారు.

ప్రభుత్వ భూమిని నోటరీ చేసి అమ్ముతున్నరు
జవ‌‌‌‌హర్‌‌‌‌న‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌లో ప్రభుత్వ భూమిని నోట‌‌‌‌రీ చేసి అమ్మేస్తున్నారు. 6 వేల ఎక‌‌‌‌రాల‌‌‌‌కు 2500 ఎక‌‌‌‌రాలు మాత్రమే మిగిలింది. దీనికి కూడా ప్లాట్లు చేసి అక్రమ లే ఔట్‌‌‌‌తో అమ్మేస్తున్నారు. తాజాగా 15 ఎక‌‌‌‌రాల స్థలాన్ని స్థానికంగా ఉన్న వ్యక్తి కాజేయాల‌‌‌‌ని ప్రయ‌‌‌‌త్నిస్తున్నారు.  

– ముఖేష్‌‌‌‌ కుమార్, జవహర్​నగర్

60 గజాల ప్లాట్లు చేసి అమ్మకం
ఇరిగేష‌‌‌‌న్ నాలాకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 60 గ‌‌‌‌జాల ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. వ‌‌‌‌ర‌‌‌‌ద నీరు వ‌‌‌‌చ్చి చేరే లోత‌‌‌‌ట్టు ప్రాంతంలో పేద‌‌‌‌లు ఇల్లు కొనుక్కొని మోస‌‌‌‌పోతున్నారు. దాన్ని ఆపండి.

 – ప్రవీణ్, చిలుకాన‌‌‌‌గ‌‌‌‌ర్ కార్పొరేట‌‌‌‌ర్ భ‌‌‌‌ర్త

నేరుగా చెరువులోకే మురుగు
మియాపూర్​ ప‌‌‌‌రిస‌‌‌‌ర ప్రాంతాల్లోని భక్షికుంట‌‌‌‌, రేగుల కుంటల‌‌‌‌ను సుంద‌‌‌‌రీక‌‌‌‌రిస్తే ఆయా చెరువుల్లోకి మురుగును వ‌‌‌‌దిలేస్తున్నారు. ఇక్కడున్న గేటెడ్ క‌‌‌‌మ్యూనిటీకి చెందిన వారు సీవ‌‌‌‌రేజ్ ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాంట్‌‌‌‌ ద్వారా మురుగును శుభ్రం చేయ‌‌‌‌కుండా నేరుగా చెరువులోకి వ‌‌‌‌దిలేస్తున్నారు. దీంతో రూ. కోట్లు ఖ‌‌‌‌ర్చు చేసి కాపాడిన చెరువు మ‌‌‌‌ళ్లీ దుర్గంధంగా మారుతోంది. వరద కాల్వలు కూడా కబ్జాకు గురవుతున్నాయి.

– చందాన‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌ ప్రజా సంఘాల లీడర్లు