
హైదరాబాద్ లోని చందానగర్ లో ఉన్న గంగారం పెద్దచెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పెద్దచెరువులో 5 ఎకరాలు కబ్జాకు గురైందంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో చెరువు ఆక్రమణపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రంగనాథ్.
చెరువుల ఆక్రమణలు సహించేది లేదని.. కబ్జాకు పాల్పడింది ఎంతటివారైనా వదిలేదని అన్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని.. ప్రస్తుతం సిటీలో డ్రైనేజి, ట్రాఫిక్ వంటి సమస్యలకు ప్రధాన కారణం ఆక్రమణలు అని అన్నారు రంగనాథ్.
చెరువులను ఆక్రమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆక్రమణల గురించి ఎటువంటి భయం లేకుండా హైడ్రకు ఫిర్యాదు చేయాలని అన్నారు కమిషనర్ రంగనాథ్.