
హైడ్రా దూకుడు పెంచింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా.. ఆక్రమణలకు పాల్పడింది ఎవరన్నది చూడకుండా కూల్చివేతలే టార్గెట్ గా వెళ్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు భారీ షాక్ ఇచ్చింది. ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన ఫామ్ హౌస్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. శనివారం ( ఏప్రిల్ 19 ) కొండాపూర్ లోని సర్వే నంబర్ 79లో ఉన్న ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు.
ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫామ్ హౌస్ తో పాటు ఆఫీస్ నిర్మించినట్లు తెలిపారు అధికారులు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నిర్మాణాలు చేపట్టారని..సర్వే నెంబర్ 79 లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు అధికారులు.
►ALSO READ | Real Estate: హైదరాబాదులో పెరిగిన అమ్ముడుకాని ఇళ్ల సంఖ్య.. 3 నెలల్లో 26% పడిన సేల్స్
సర్వే నంబర్ 79లో ఉన్న 39 ఎకరాల్లో ఉన్న కమర్షియల్ షెడ్లను కూల్చేశారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలో కూల్చివేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కుటుంబసభ్యులు. పోలీసు బందోబస్తు మధ్య ఫామ్ హౌస్ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. సర్వే నంబర్ 79లో ఎలాంటి నిర్మాణంకు చేపట్టవద్దని బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు.