కొహెడ‌‌‌‌లో హైడ్రా కూల్చివేత‌‌‌‌లు

కొహెడ‌‌‌‌లో హైడ్రా కూల్చివేత‌‌‌‌లు

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొహెడలో హైడ్రా ఆదివారం కూల్చివేతలు చేపట్టింది. గ్రామ సర్వే నంబర్ 951, 952 లోని త‌‌‌‌మ ప్లాట్లను స‌‌‌‌మ్మిరెడ్డి బాల్‌‌‌‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి ర‌‌‌‌హ‌‌‌‌దారులు లేకుండా ఫామ్‌‌‌‌ హౌస్ క‌‌‌‌డుతున్నారని రాధే ధామం లేఅవుట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేసింది. 

దీంతో  అన్ని పత్రాలతో హాజరు కావాలని ఇరు ప‌‌‌‌క్షాల‌‌‌‌కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న డాక్యుమెంట్స్ పరిశీలించి ఫామ్‌‌‌‌హౌస్ షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణానికి ఎలాంటి అనుమ‌‌‌‌తులు లేవ‌‌‌‌ని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ ఆదివారం వాటిని కూల్చివేశారు.