హైదరాబాద్: హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. ఇది వరకు ఈవీడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో భాగంగా ఉండేదని, అప్పుడు ఐఏఎస్లు, కమిషనర్లు ఉండేవారని, ఇప్పుడు సెపరేట్ వింగ్గా ఏర్పడిందని ఆయన వివరించారు. కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మున్సిపాలిటీల పరిధిలోనూ హైడ్రా పనిచేస్తుందని తెలిపారు.
ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ వెదర్, క్లైమెట్ సర్వీసెస్ పై స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది. బేగంపేట్ గ్రీన్ ల్యాండ్స్లోని నిజామియా అబ్జర్వేటరీ సెస్ ఆడిటోరియంలో వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐఎండీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. ఐఎండీ 1875లో ఏర్పడిందని, హైడ్రా 2024 జులైలో ఏర్పడిందని రంగనాథ్ గుర్తుచేశారు. అర్బన్ డిజాస్టర్స్, ఆక్రమణలకు అడ్డు కట్టవేయడం కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని చెప్పారు. హైడ్రాకు మొదటి కమిషనర్గా ఉండటం సంతోషంగా ఉందని, హైడ్రా దేశంలోనే మొదటి సారి ఏర్పాటైందని తెలిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంకా ఏమన్నారంటే..
* డిజాస్టర్ట్స్లో కూడా మార్పులు వస్తున్నాయి.. తెలంగాణలో అర్బనైజేషన్ పెరుగుతుంది
* నేను ట్రాఫిక్ విభాగంలో పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా.. వెహికిల్ పాపులేషన్ 80 లక్షలు దాటింది
* హైదరాబాద్లో ట్రాఫిక్ అడిషినల్ సీపీగా కూడా ఉన్నాను. 2, 3 సెంటిమీటర్ల వర్షం పడితే మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది
* మెట్రో సిటీలలో క్లైమెట్ ఛేంజెస్ ఎక్కువగా ఉన్నాయి.. క్లౌడ్ బరస్ట్స్ కూడా పెరుగుతున్నాయి.
* నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వర్షం పడినప్పుడు వరద నీరు ఇంకడానికి చాలా సమయం పడుతుంది.
* సాయంత్రం 4, 5 గంటలకు వర్షం పడితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకడానికి మార్గాలు లేవు.
* సిటీలో 150 వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. అర్బన్ డిజాస్టర్ల మీద ఫోకస్ పెట్టాలి.
*157 ఏడబ్ల్యుఎస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా కావాలి.
* ప్రతీ 15 నిమిషాలకు బెంగుళూరులో ఏడబ్ల్యుఎస్ స్టేషన్ల నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. మనం కూడా దీనికి మారాలి.
* సిటీలో వెదర్ రాడర్స్ కావాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హిల్ ఏరియాలలో పెట్టాల్సిన అవసరం ఉంది.
* వెదర్ అలర్ట్స్ స్పెసిఫిక్గా ఉండాలి. ఇక్కడ వర్షం పడుతుంది అని కాకుండా ఇక్కడ పడదు అని చెప్పేలా వెదర్ అలర్ట్స్ ఉండాలి.