
హైదరాబాద్, వెలుగు: యజమానులు తమ ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు HRCSIndia.com వెబ్సైట్అందుబాటులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిని హైదరాబాద్‌లో గురువారం ప్రారంభించారు. ఇది అందించే సమాచారంలో ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన వివరాలు, అప్పులకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లను కూల్చివేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొనడంతో దీనిని అందుబాటులోకి తెచ్చామని హెచ్ఆర్సీఎస్తెలిపింది. దీనివల్ల యజమానులు తమ ఇళ్లు సరైన స్థలంలో ఉన్నాయో లేదో ఉచితంగా తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ వెబ్‌సైట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుందని సంస్థ సీఈఓ హర్షవర్ధన్ తెలిపారు