
సొంత డబ్బులతో కొనుక్కున్న కమర్షియల్ ప్లాట్.. దాని ముందు రోడ్డు ఆక్రమణకు గురైంది..40 ఫీట్ల రోడ్డును 20ఫీట్లు ఆక్రమించారు.. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏళ్ల తరబడి ఏ అధికారికి కంప్లయింట్ చేసినా నో రెస్పాన్స్.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. ఇప్పుడు ఒక్క ఫిర్యాదుతో ఆక్రమణదారుల ఆగడాలకు చెక్ పడింది. కంప్లయింట్ చేసిన 24గంటల్లో ఆక్రమణలను కూల్చేశారు. ఏన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. థ్యాంక్స్ టు హైడ్రా అని ఓ బాధితురాలు కృతజ్ణతలు తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ సన్సిటీలోని రాధాకలాన్లో నివాసముంటున్న ఓ రెసిండెంట్ దుబాయ్లో ఉంటుంది. ఇదే అదనుగా ఆమె ప్లాట్ కు ఎదురుగా ఉంటున్న వారు రోడ్డును ఆక్రమించిన 20ఫీట్లు ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టారు. బాధితుడు దుబాయ్ నుంచి వచ్చిన ప్రతీసారి రోడ్డు ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు.గత ఐదేళ్లుగా ఇదే విషయంలో పలుమార్లు అధికారులకు కంప్లయింట్ చేసింది. ఏ అధికారి పట్టించుకోలేదు.
ALSO READ | వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ.2.31కోట్లు
అయితే సోమవారం (మార్చి 4) న ప్రజావాణిలో హైడ్రాకి ఫిర్యాదు చేసింది. HYDRAA కమిషనర్ AV రంగనాథ్ తక్షణ చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఒక రోజులోనే ఆక్రమణలు తొలగించబడ్డాయి. రోడ్డు పూర్తిగా వెడల్పయింది. స్థానిక మున్సిపల్ అధికారులు తమ పర్యవేక్షణలో కూల్చివేతను నిర్వహించారని హైడ్రా అధికారులు ధృవీకరించారు.
ఐదేళ్ల సమస్య పరిష్కారం కావడంతో ఫిర్యాదు దారుడు సంతోషం వ్యక్తం చేశాడు. ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆక్రమణలను తొలగించారు. హైడ్రా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు.