ఇసుక అక్రమ రవాణా కట్టడి బాధ్యత హైడ్రాకు: కమిషనర్​ రంగనాథ్

ఇసుక అక్రమ రవాణా కట్టడి బాధ్యత హైడ్రాకు: కమిషనర్​ రంగనాథ్
  • 357 మందికి డీఆర్ఎఫ్​ శిక్షణ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా మీద నమ్మకంతో ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగిస్తోందని హైడ్రా చీఫ్​రంగనాథ్​తెలిపారు. ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యతను అప్పగించిందని చెప్పారు. -పోలీస్​ఉద్యోగాల కోసం ప్రయత్నించి అతి తక్కువ మార్కులతో జాబ్​ కోల్పోయిన 357 మందిని డీఆర్ఎఫ్(ఔట్ సోర్సింగ్)లోకి తీసుకున్న హైడ్రా వారికి అంబర్ పేట పోలీస్​గ్రౌండ్ లో శిక్షణ ప్రారంభించింది. 

గురువారం శిక్షణా కార్యక్రమాన్ని రంగనాథ్​ప్రారంభించి మాట్లాడారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీలకమైనదని, అప్పగించిన బాధ్యతలను నూటికి నూరు శాతం నెరవేర్చాలన్నారు. హైడ్రా ఔట్​సోర్సింగ్​జాబుల్లో చేరిన వారిలో మేనేజర్లతోపాటు అసిస్టెంట్లు కూడా ఉన్నారు. మేనేజర్లకు నెలకి రూ.22,500, అసిస్టెంట్లకు నెలకి రూ.19,500 జీతం అందజేయనున్నది.