కరీంనగర్ జిల్లాలో హైనా ఊర్లమీద పడింది. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో హైనా సంచారం కలకలం రేపింది. అర్థరాత్రి గ్రామంలోని కుక్కలను వేటాడింది. ఓ కుక్కపై దాడి చేసి నోట కర్చుకుంది. హైనా సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భారీ చప్పుళ్లు, కేకలు వేడయంతో గుట్టలోకి పారిపోయింది.
హైనా సంచారంపై ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. మల్లాపూర్ లోకి వచ్చిన అధికారులు..హైనా ఆనవాళ్లు సేకరించారు. రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.