హైపర్ ​లూప్​ టెస్ట్ ట్రాక్ రెడీ: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

హైపర్ ​లూప్​ టెస్ట్ ట్రాక్ రెడీ: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: హైపర్ లూప్ ప్రాజెక్ట్‎లో భాగంగా ఐఐటీ మద్రాస్ తొలి టెస్ట్ ట్రాక్‎ను 422 మీటర్ల మేర ట్రాక్‎ను సిద్ధం చేసిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​ట్వీట్​చేశారు. భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ కొత్త ఆవిష్కరణలకు ఆర్థికంగా సహాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం టెస్ట్ ట్రాక్ మాత్రమే సిద్ధమైందని, ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. 

ప్రాజెక్టులో తదుపరి దశ ప్రయోగాల కోసం ఐఐటీ మద్రాస్‎కు మరో 9 కోట్లు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే తొలి కమర్షియల్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. కాగా, ఈ ప్రాజెక్ట్ పూర్తయి హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే 350 కిలోమీటర్ల దూరం జస్ట్ 30 నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రి తెలిపారు.