35 ఏళ్లకే బీపీ, షుగర్​.. ఖమ్మం జిల్లాలో లక్షా 32 వేల మంది పేషెంట్లు

35 ఏళ్లకే బీపీ, షుగర్​.. ఖమ్మం జిల్లాలో లక్షా 32 వేల మంది పేషెంట్లు
  • యువతలో పెరుగుతున్న బీపీ, షుగర్లు​ 
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఇదీ.. 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీపీ, షుగర్​ పేషంట్ల సంఖ్య పెరుగుతోంది. వీటితో జిల్లా వ్యాప్తంగా 1,32,060 మంది బాధపడుతున్నట్లు తేలింది. ప్రధానంగా యువత బీపీ, షుగర్​వ్యాధుల బారిన ఎక్కువగా పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల  జిల్లాలో ఎన్​సీడీ(అసంక్రమిత వ్యాధుల నివారణ ప్రోగ్రాం)లో భాగంగా స్పెషల్​ సర్వే నిర్వహించారు. జిల్లాలో 6,23,444మందికి గానూ 4,88,821 మందికి బీపీకి సంబంధించి స్క్రీనింగ్​ టెస్ట్​ చేశారు. ఇందులో 87,754 మంది బీపీతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. 38,850 మంది గవర్నమెంట్​ హాస్పిటళ్లలో మందులు వాడుతున్నారు. 5,12,321 మందికి షుగర్​కు సంబంధించి స్క్రీనింగ్​ చేశారు. 44,306 మంది షుగర్​తో బాధపడుతున్నట్టు గుర్తించారు. 20,160 మంది గవర్నమెంట్​ హాస్పిటళ్లలో మందులు 
వాడుతున్నారు. 

35 ఏండ్లలోపు వారే ఎక్కువ... 

సర్వేలో 35 ఏండ్ల లోపు వారే ఎక్కువగా బీపీ, షుగర్​ బారిన పడుతున్నట్టుగా వైద్య సిబ్బంది గుర్తించారు. బీపీ, షుగర్​తో 1,32,060 మంది బాధపడుతుండగా ఇందులో దాదాపు సగం మంది రెండింటితో ఇబ్బందిపడుతున్నారు. కాగా, గవర్నమెంట్​ హాస్పిటళ్లలో బీపీ, షుగర్​కు కావాల్సిన మందులు సరిగా అందుబాటులో ఉండడం లేదని, పేషెంట్లను సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

మందులు అందుబాటులో ఉన్నాయి

బీపీ, షుగర్లకు సంబంధించిన మందులు అన్ని గవర్నమెంట్​ హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో పాటు టెన్షన్లను తగ్గించుకోవడంతో చాలా వరకు బీపీ, షుగర్లను తగ్గించుకోవచ్చు. 

ఎల్.భాస్కర్​ నాయక్, డీఎంహెచ్​ఓ, భద్రాద్రికొత్తగూడెం