ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది

  • కారు పేరు టైగర్–ఎక్స్

కార్.. కార్.. సూపర్ కార్.. ఇది అలాంటిలాంటి కారు కాదు.. మామూలు రోడ్ల మీద ఏ కారైనా పని చేస్తుంది. కొండ కోనల్లో, అడవుల్లో, భూకంపాలు లాంటివి వచ్చిన చోట మామూలు కార్లు పనికి రావు కదా.. కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, పొదల్లో, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో అవసరమైతే నడిచి వెళ్లగలగాలి. ఒక్కోసారి మనుషులు ఫాస్ట్‌‌గా చేరుకోలేని చోట్లకు అత్యవసరంగా మెడికల్ కిట్స్, ఫుడ్, ఇతరత్రా వస్తువులు అందించాల్సి రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి ఈజీగా వెళ్లిపోయేలా హుండయ్ కంపెనీ కారును డిజైన్ చేసింది. అల్టిమేట్ మొబిలిటీ వెహికల్స్ పేరుతో మొదలుపెట్టిన ప్రాజెక్టులో భాగంగా నడవగలిగే, అవసరమైతే ఎగరగలిగే అడ్వాన్స్డ్ వెర్షన్ కారును తీసుకొచ్చింది. దీనికి టైగర్–ఎక్స్1 అని పేరు పెట్టింది.

ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగే అడ్వాన్స్డ్‌‌ ట్రాన్స్‌‌పోర్టేషన్ విధానాలపై హుండయ్ కంపెనీ కొన్నేండ్లుగా ప్రయోగాలు చేస్తోంది. రెండేండ్ల క్రితం తొలిసారి నడిచే కారును తయారు చేసింది. 2019 జనవరిలో హుండయ్ ఎలివేట్ అనే పేరుతో ఆ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు దానికి మరింత టెక్నాలజీ అడ్వాన్స్‌‌మెంట్స్ జోడించి ఎగిరే కారు తెచ్చింది. ఈ నెల 10న కొత్త హుండయ్ ‘టైగర్–ఎక్స్‌‌1’ కారును ఇంట్రడ్యూస్ చేసింది. మామూలు కారులాగే నాలుగు చక్రాలతో వెళ్లగలదు. అలాగే ఈ కారు కొండ గుట్టల్లాంటి ప్రాంతాల్లో నడవడమే కాదు, మనుషులు చేరుకోలేని ప్రాంతాలకు వేగంగా డ్రోన్ లింక్‌‌తో వెళ్లిపోగలదు. ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా రెస్క్యూ టీమ్స్‌‌కు మళ్లీ మళ్లీ ఫుడ్, మెడిసిన్స్ వంటివి చేరవేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. లోపల మనిషి లేకుండా జీపీఎస్ సెట్ చేసి ఆపరేట్ చేస్తే ఫాస్ట్‌‌గా అక్కడికి చేరుకుంటాయి. ఇది భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌‌లపై పరిశోధనల కోసం సైంటిస్టులకు రోవర్‌‌‌‌గా కూడా ఉపయోగపడుతుందని హుండయ్ కంపెనీ చెబుతోంది.

2019లో వచ్చిన ఎలివేట్‌‌కు అప్‌‌డేట్‌‌

అల్టిమేట్ మొబిలిటీ వెహికల్స్ పేరుతో ఎటువంటి ప్రాంతాలనైనా చేరుకునే వెహికల్స్‌‌ను హుండయ్ కంపెనీ తయారు చేయడం మొదలుపెట్టింది. మొదటిసారి 2019లో ఎలివేట్ పేరుతో నడిచే కారును తీసుకొచ్చింది. మనిషి మెట్లు లాంటివి ఎక్కగలగడానికి కారణం మోకాలు జాయింట్ ఫంక్షనింగ్. దీనిని కారుకు అప్లై చేసింది హుండయ్ కంపెనీ. వీల్ రొటేషన్‌‌తో పాటు నడవగలిగే కారును తయారు చేసింది. దీనికి ఎలివేట్ అని పేరు  పెట్టింది. ముఖ్యంగా భూకంపాలు, అడవుల్లో కార్చిచ్చు లాంటి ప్రకృతి విపత్తుల టైమ్‌‌లో చిక్కుకుపోయిన వాళ్లను ఎక్కువ దూరం భుజాలపై మోసుకెళ్లి అంబులెన్సుల్లో ఎక్కించే పని లేకుండా స్పాట్‌‌కే వెహికల్ రీచ్ అవ్వాలన్న కాన్సెప్ట్‌‌తోనే దీనిని తయారుచేసినట్లు హుండయ్ కంపెనీ చెప్పింది. గాయపడిన వాళ్లకు ఇందులో ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ ఆస్పత్రికి చేర్చొచ్చు. 360 డిగ్రీల్లో ఎటువైపైనా ఇది ట్రావెల్ చేయగలదు. మంచు ప్రాంతాల్లో కూడా నడవగలదు. తేలిక మెటీరియల్‌‌తో దీనిని తయారు చేశారు. అలాగే వికలాంగులు లాంటి వారిని మెట్లపైకి ఎక్కి వచ్చి ఈ కారులో ఎక్కించుకుంటుంది ఎలివేట్. డ్రైవర్ లేకుండా కూడా ఇది ట్రావెల్ చేయగలదు. ఈ కారుకు అడ్వాన్స్డ్ వెర్షన్‌‌గా ఇప్పుడు టైగర్–ఎక్స్1ను తీసుకొచ్చింది హుండయ్ మోటార్ గ్రూప్‌‌కు చెందిన న్యూ
హారిజన్స్ స్టూడియో.

ఎమర్జెన్సీ పర్పస్‌‌ వెహికల్

టైగర్–ఎక్స్1 కారు.. పాసింజర్ పర్సస్ కోసం తెచ్చింది కాదు. ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఫుడ్, ఇతర వస్తువులను స్పాట్‌‌కు చేర్చేందుకు డిజైన్ చేసిన వెహికల్ ఇది. టైగర్ ఫుల్ ఫామ్ ట్రాన్స్‌‌ఫామింగ్ ఇంటెలిజెంట్ గ్రౌండ్ ఎక్స్‌‌కర్షన్ రోబో. భూకంపాలు, సునామీలు, వరదలు ఇలా ఏ రకమైన విపత్తులు వచ్చినా మనుషులు నేరుగా ఆ స్పాట్‌‌కు చేరుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. అటువంటప్పుడు అక్కడ చిక్కుకుపోయిన బాధితులకు ఫుడ్, మెడిసిన్స్ లాంటి ఫాస్ట్‌‌గా చేరవేయడంలో టైగర్ ఉపయోగపడుతుందని న్యూ హారిజన్స్ స్టూడియో చీఫ్ జాన్ సుహ్ తెలిపారు. కొండలు, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో అడ్డంకులు ఎదురైనప్పుడు కాళ్లతో పైకి నడిచి ముందుకు సాగిపోతుందన్నారు. అయితే దీనిపై ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నామన్నారు.

డ్రోన్ కూడా ఫిట్ చేయొచ్చు

టైగర్‌‌‌‌లో 28 సెన్సర్లు, 28 మోటార్లు ఫిట్ చేసి ఉంటాయి. ముందు, వెనుక ఎటువైపు ఏ ముందనేది గమనిస్తూ అది కదులుతుంది. టైగర్‌‌‌‌ను చాలా తేలిక మెటీరియల్‌‌తో తయారు చేయడం ద్వారా దీనికి డ్రోన్‌‌ను ఫిట్ చేసి అవసరమైన చోటుకు ఎగురుకుంటూ వెళ్లేలా చేయొచ్చు. దీని ద్వారా ఎమర్జెన్సీలో ఉన్న వాళ్లకు ఎగురుకుంటూ వెళ్లి అత్యవసరమైన వస్తువులను అందించొచ్చు. విపత్తుల్లో చిక్కుకున్న వాళ్లకు వేగంగా రెస్క్యూ టీమ్స్‌‌ కంటే ముందుగా మెడిసిన్స్, ఫుడ్ లాంటివి చేరవేయొచ్చని జాన్ చెప్పారు. మామూలు వెహికల్స్ చేరుకోలేని చోట, యుద్ధాల్లో ఉన్న సైనికులకు కూడా అవసరమైనవి దీని ద్వారా అందించొచ్చు.

For More News..

ప్రశ్నించే గొంతు మూగబోయింది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది

జీవోలు ఇచ్చి.. చెత్తబుట్టలో వేస్తరా?