హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు త్వరలో ఇండియాలో లాంచ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 25వేల అడ్వాన్స్ చెల్లించి కారు బుకింగ్ చేసుకోవచ్చు జనవరి 17న భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును ప్రారంభించనున్నారు.
హ్యుందాయ్ క్రెడా ఎలక్ట్రిక్ వెహికల్ ను ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (O), ప్రీమియం, ఎక్సలెన్స్ అనే ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ స్మార్ట్ (O) ,ఎక్సలెన్స్ ట్రిమ్ లలో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ కారు వివిధ రంగుల్లో వస్తుంది. డ్యూయెట్ టోన్, మ్యాట్ ఆప్షన్లతో ఎంచుకునేందుకు 10 షేడ్స్ ఉంటాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్.. సాధారణ క్రెటా తో పోల్చితే..
Creta EV దాని ICE తోబుట్టువుల నుంచి రూపొంచడం జరిగింది.. కాబట్టి మొత్తం కాంపాక్ట్ SUV సిల్హౌట్ ఒకేలా ఉంటుంది. షట్ ఆఫ్ బంపర్ గ్రిల్, యాక్టివ్ ఎయిర్ ప్లాప్ లు, కొత్త స్కిడ్ ప్టేల్ వంటి బిట్ లలో స్వల్ప తేడా ఉంటుంది. అల్లాయ్ వీల్స్ లో ఏరోడైనమిక్ డిజైన్, రిఫ్రెస్ చేసిన బంపర్లు ఉన్నాయి. పిక్సెల్ థీమ్ ఇన్సర్ట్ లు eSUV ని Ioniq5 వంటి ప్రీమియం హ్యుందాయ్ EVలకు అనుగుణంగా ఉంటాయి.
ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ కొత్త క్రెటా Kona EV (విదేశాల్లో విక్రయించబడింది) , Ioniq 5 డ్రైవ్ మోడ్ సెలెక్టర్ (ఎకో, నార్మల్ , స్పోర్ట్) నుంచి స్టీరింగ్ వీల్‌ను తీసుకోవడం జరిగింది. ఇన్‌స్ట్రుమెంటేషన్ , ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా సెటప్ , ADAS వంటి ఫీచర్లు క్రెటా ICE నుండి తీసుకోబడ్డాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్..బ్యాటరీ ప్యాక్‌లు
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్..రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది.51.3kWh (473km పరిధి) , 42kWh (390km పరిధి) రెండు బ్యాటరీ ప్యాక్‌లు క్రెటా ఎలక్ట్రిక్‌తో వస్తాయి. రెండూ ARAI మైలేజీలు. క్రెటా లాంగ్ రేంజ్ (51.3kWh) 60kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 58 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే 10 నుంచి100 శాతం AC వాల్ బాక్స్ యూనిట్‌తో 4 గంటలు పడుతుంది.
EV 7.9 సెకన్లలో 0 నుండి 100kph వేగాన్ని అందుకుంటుంది. ఇది Creta N లైన్ DCT (8.9 సెకన్లు) కంటే కూడా వేగంగా ఉంటుంది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలో సింగిల్-పెడల్ డ్రైవింగ్ కూడా అందించబడుతుంది. Tata Curvv EV, MG ZS EV, మారుతీ e విటారా , మహీంద్రా BE 6లకు ఇది గట్టి పోటీని ఇస్తుందని అంచనా.