వారంలో 50 శాతం తగ్గిన హ్యుందాయ్ జీఎంపీ

వారంలో 50 శాతం తగ్గిన హ్యుందాయ్ జీఎంపీ

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓకి  గ్రే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ తగ్గుతోంది. కేవలం వారం రోజుల్లోనే  గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) 54 శాతం పడిపోయింది. ఈ నెల 15–17 మధ్య ఓపెన్ కానున్న హ్యుందాయ్ ఐపీఓ,  ఒక్కో షేరును రూ.1,865– 1,960 రేంజ్‌‌‌‌‌‌‌‌లో అమ్ముతోంది. ఈ నెల 4 కి  ముందు గ్రే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  ఇష్యూ ధర కంటే రూ.370 ఎక్కువ పలికిన  కంపెనీ షేర్లు, అక్టోబర్ 11 నాటికి  రూ.170 మాత్రమే ఎక్కువ పలుకుతున్నాయి. కంపెనీ జీఎంపీలో 54 శాతం తగ్గుదల కనిపించింది. 

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.27,856 కోట్లను హ్యుందాయ్ మోటార్ ఇండియా సేకరించాలని చూస్తోంది. ఇండియా ఐపీఓ హిస్టరీలో ఇదే అతిపెద్దదిగా నిలవనుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా  ఇష్యూ ధర కంటే ఎంత ఎక్కువకు షేర్లు పలుకుతున్నాయనే విషయం అర్ధమవుతుంది. బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, సింగపూర్ సావరిన్ వెల్త్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ జీఐసీ పీటీఈ, బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ కంపెనీ ఐపీఓలో  షేర్లను కొననున్నాయి.