న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ఈ నెల 14 న ఇన్వెస్టర్ల ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఇండియా హిస్టరీలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలవనుంది. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల విలువైన ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్దదిగా కొనసాగుతోంది.
హ్యుందాయ్ ఫైల్ చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ప్రకారం, ప్రమోటర్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 14.22 కోట్ల విలువైన షేర్లను అమ్మనుంది. ఫ్రెష్ షేర్ల ఇష్యూ లేదు. హ్యుందాయ్ మోటార్ 1996 లో ఇండియాలో బిజినెస్ మొదలు పెట్టింది.
ALSO READ | మనక్సియాకు రూ.200 కోట్ల విలువైన ఆర్డర్