హ్యుందాయ్ ఐపీఓకి కనిపించని డిమాండ్

హ్యుందాయ్ ఐపీఓకి కనిపించని డిమాండ్

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌ మోటార్ ఇండియా ఐపీఓకి పెద్దగా డిమాండ్ కనిపించలేదు.  సుమారు 10  కోట్ల షేర్లను ఐపీఓలో అమ్మకానికి పెట్టగా, మొదటి రోజు సుమారు 1.7 కోట్ల షేర్లకు  బిడ్స్  వచ్చాయి. అంటే ఈ పబ్లిక్ ఇష్యూ 0.18 రెట్లు లేదా 18 శాతం  సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయ్యింది.  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ డేటా ప్రకారం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన సుమారు 5 కోట్ల షేర్లలో 26 శాతం  షేర్లకు కంపెనీ బిడ్స్ అందుకుంది.  నాన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం  కేటాయించిన  2.12 కోట్ల షేర్లలో  సుమారు 13 శాతం షేర్లకు    బిడ్స్ దక్కించుకుంది.

 క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) పోర్షన్‌‌‌‌‌‌‌‌ 5 శాతం సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ సాధించింది. 14.2 కోట్ల  హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లను  పేరెంట్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ తాజా ఐపీఓ, ప్రీ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్ )  కింద అమ్ముతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.27,870 కోట్లను సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే   యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315 కోట్లను సేకరించింది.  కంపెనీ ఐపీఓ ఈ నెల 15–17 మధ్య ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఒక్కో షేరు రూ.1,865–1,960 రేంజ్‌‌‌‌‌‌‌‌లో  అందుబాటులో ఉంది.