
- రేట్లు పెంచుతామని ఇదివరకే ప్రకటించిన మారుతి, కియా, టాటా
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి బండ్ల ధరలను పెంచుతామని హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా ప్రకటించాయి. మారుతి సుజుకీ, కియా ఇండియా, టాటా మోటార్స్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ధరలు పెంచుతామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఏడాది జనవరిలో బండ్ల ధరలను పెంచిన కంపెనీలు, ఈ ఏడాది రెండోసారి రేట్లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. ముడిసరుకుల ధరలు బాగా పెరిగాయని, దీనికితోడు నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువ కావడంతో ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. వివిధ మోడల్స్‌పై 3 శాతం వరకు ధరలను పెంచుతామని హ్యుందాయ్ ప్రకటించింది.
ఈ ఏడాది జనవరిలో బండ్లపై రూ.25 వేల వరకు రేట్లు పెంచింది. ఇండియాలో గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐయానిక్5 వరకు వివిధ మోడల్స్‌ను కంపెనీ అమ్ముతోంది. వీటి ధరలు రూ.5.98 లక్షల నుంచి రూ.46.3 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. అన్ని బండ్ల రేట్లను పెంచుతామని హోండా ప్రకటించింది. ఈ కంపెనీ అమేజ్, సిటీ, సిటీ ఈ: హెచ్‌ఈవీ, ఎలివేట్ వంటి మోడల్స్‌ను ఇండియాలో అమ్ముతోంది. ఎంతమేర ధరలు పెంచుతుందో ప్రకటించలేదు.