హ్యుందాయ్ మోటార్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 రెండో త్రైమాసికంలో 1375.47 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మంగళవారం (నవంబర్12) న ప్రకటించిన సెకండ్ క్వార్టర్ ఫలితాల్లో.. గత ఫైనాన్షియల్ ఇయర్ ఇదే త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం నికర లాభం తగ్గింది. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 1628.46 కోట్ల నికర లాభం ఉండగా.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 1375.47 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
అదేవిధంగా 2025 సెకండ్ క్వార్టర్ లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి రూ.18,659.69 కోట్లనుంచి రూ.17,260 కోట్లకు పడిపోయింది. మరోవైపు మంగళవారం ( నవంబర్ 12) మధ్యాహ్నం హ్యుందాయ్ మోటార్ షేర్లు BSEలో 2.60 శాతం తగ్గి 1,775 వద్ద ట్రేడ్ అయ్యాయి.
ALSO READ | మార్కెట్‌లోకి కొత్త స్విఫ్ట్డిజైర్.. ప్రారంభ ధర రూ. 6 లక్షలే!