
వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం, ఏటూరు నాగారం మండల కేంద్రాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.27 లక్షల విలువైన పరికరాలను హుండాయ్ మోటర్స్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సమారిటర్న్స్ ఫర్ ద నేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్సురేశ్ కుమార్ మాట్లాడుతూ హుండాయ్ మోటర్స్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ రిలీఫ్ ఫండ్ (2025) నుంచి ఈసీజీ మిషన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, పీడియాట్రిక్ ఫొటో తెరపీ మిషన్స్, ఓమర్, బీపీ ఆపరేటర్స్, బెడ్స్, కబోర్డ్స్, రిఫ్రిజిరేటర్ అందజేసినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హుండాయ్ మోటర్స్ సంస్థ నుంచి రామకుమార్ హ్యుండై, సీఎస్ఆర్ టీం సభ్యులు శ్రీకాంత్, సచిన్, డాక్టర్ విధిష్టర్ పాల్గొన్నారు.