మరో 2 నెలల్లోనే హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌, స్విగ్గీ, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ గ్రీన్ ఐపీఓలు

మరో 2 నెలల్లోనే హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌, స్విగ్గీ, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ గ్రీన్ ఐపీఓలు

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా, స్విగ్గీ, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ వంటి అర డజనకు పైగా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కు రావడానికి రెడీగా ఉన్నాయి.  వచ్చే రెండు నెలలో ఈ కంపెనీలు రూ.60 వేల కోట్లను సేకరించనున్నాయి. ఆఫ్కాన్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వారీ ఎనర్జీస్‌‌‌‌‌‌‌‌, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, వన్‌‌‌‌‌‌‌‌ మొబిక్విక్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌, గరుడ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐపీఓకి వచ్చేందుకు లైన్‌‌‌‌‌‌‌‌ కట్టాయి.

ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– డిసెంబర్ మధ్య 30 కి పైగా ఐపీఓలు వస్తాయని ఈక్విరస్ ఎండీ మునిష్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్  పేర్కొన్నారు. వివిధ సెక్టార్ల నుంచి వేరు వేరు సైజ్‌‌‌‌‌‌‌‌లలో ఈ ఐపీఓలు ఉండనున్నాయని తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.25 వేల కోట్లను ఐపీఓ ద్వారా సేకరించనుంది. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ  రూ.10,414 కోట్లను,  రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ  ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.10 వేల కోట్లను, షాపూర్జి పల్లోంజి గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.7 వేల కోట్లను, రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ వారీ ఎనర్జీస్‌‌‌‌‌‌‌‌ రూ.3 వేల కోట్లను ఐపీఓ ద్వారా సేకరించనున్నాయి.