హ్యుందాయ్ ఐపీఓ ధర రూ. 1,865– రూ. 1,960

హ్యుందాయ్ ఐపీఓ ధర  రూ. 1,865– రూ. 1,960

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా వచ్చే వారం తన ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ని ప్రారంభించనుంది. ఇది ఈ సంవత్సరం దేశంలో అతిపెద్ద స్టాక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒక్కో షేరుకు రూ. 1,865–  రూ. 1,960 మధ్య ఉండవచ్చని,  సంస్థ విలువ రూ. 1.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

రూ.25 వేల కోట్ల ఐపీఓఈ నెల సంస్థాగత పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది. రిటైల్,  ఇతర పెట్టుబడిదారులు 15–-17 తేదీల్లో బిడ్స్​వేయవచ్చు. ఈ స్టాక్ అక్టోబర్ 22న ముంబై ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే అవకాశం ఉంది.