చండూరు (మర్రిగూడ), వెలుగు: ‘ నేను పక్కా లోకల్.. నాన్ లోకల్ వారికి ఓటేస్తే మోసపోతాం’ అని టీఆర్‌ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.
22 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండడం వల్లే అభివృద్ధి చేయలేకపోయానని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు చేరింది అధికారపక్షంలోనా, ప్రతిపక్షంలోనా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, తోటకూర శంకర్ పాల్గొన్నారు.