ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..DOGE నుంచి తప్పుకుంటున్నాడు..డేట్ ఫిక్స్

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..DOGE నుంచి తప్పుకుంటున్నాడు..డేట్ ఫిక్స్

ప్రపంచ కుబేరుడు, ట్రంప్ ప్రభుత్వానికి కీలక సలహాదారు ఎలాన్ మస్క్ డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE) నుంచి తప్పుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ ను వదిలిపెట్టి వాషింగ్ టన్ డీసీని వీడుతున్నారా?.. డాగీలో చేరిన లక్ష్యం నెరవేరిందా? అంటే ఎలాన్ మస్క్ తాజా ప్రకటన అవుననే చెబుతోంది. అందుకు మూహూర్తం డేట్ కూడా ఫిక్స్ చేశారట. 

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ DOGE నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని విడిచిపెట్టి వాషింగ్ టన్ వీడుతున్నట్లు.. దానికి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఫెడరల్ విభాగాలన్నీ ప్రక్షాళన చేశాం.. దాదాపు ప్రభుత్వానికి 1ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించాం.. తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెప్పారు. 

ఫాక్స్ న్యూస్ ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్రంప్ టీం నుంచి మే నెలలో వైదొలగనున్నారు. మే2025 లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.. 130 రోజుల్లో మా టార్గెట్ పూర్తి చేయబోతున్నామని ఎలాన్ మస్క్ అన్నారు. తన బృందం రోజుకు 4బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేశామన్నారు. DOGE  1ట్రిలియన్ డాలర్ల పొదుపు చూడబోతుంది..ప్రస్తుత మొత్తం సమాఖ్య వ్యయం దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకని అన్నారు. 

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్‌ను వైట్ హౌస్  ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నియమించింది. డాగీ బాస్ గా అతని పని సమయం 130 రోజులు. అంటే DOGE ఆపరేషన్‌కు నాయకత్వం వహించే ఎలాన్ మస్క్ పదవీకాలం మే నెలాఖరు నాటికి ముగుస్తుంది.