Vishal Health Update: నాకెలాంటి స‌మ‌స్య లేదు. .మైక్ కూడా ప‌ట్టుకోగలుగుతున్నా.. ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ

స్టార్ హీరో విశాల్ (Vishal) ఆరోగ్య పరిస్థితిపై వారం రోజుల నుంచి తీవ్ర చర్చ నడుస్తోంది. సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకులు కూడా విశాల్ ఆరోగ్యం పై మాట్లాడుకుంటున్నారు. డాక్ట‌ర్లు హెల్త్ బులిటెన్ రెండుసార్లు రిలీజ్ చేసినా? విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు రేఖేత్తాయి.ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా అనుకున్నారు. కొందరైతే విశాల్ సినిమా కెరీర్ ఇక ముగిసిందని కూడా అనుకున్నారు. ఇపుడు అన్ని విషయాలకు హీరో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ

ఈ నేప‌థ్యంలో 'మ‌ద‌గ‌జ రాజ' మూవీ ప్రీమియ‌ర్ కి విశాల్ హాజ‌ర‌య్యారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నానని తన అభిమానులకు విశాల్ భరోసా ఇచ్చాడు. 'నాకు వైరల్ ఫీవర్ మాత్రమే ఉంది, అది అందరికీ వస్తుంది. ఇపుడు నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు కూడా వ‌ణ‌క‌డం లేదు. మైక్ కూడా క‌రెక్ట్గా ప‌ట్టుకోగలుగుతున్నా. నా పై చూపించిన ప్రేమాభిమానాల‌కు, మీరిచ్చిన ఆశీర్వదాలకు ధ‌న్యవాదాలు. నా చివ‌రి శ్వాస వ‌ర‌కూ మీ అభిమానాన్ని మ‌ర్చిపోను. నేను కోలుకోవాల‌ని మీరు పెట్టిన ప్రతీ మెసేజ్ కోలుకునేలా చేసాయని' విశాల్ చెప్పుకొచ్చారు.

అయితే, 'నేను నిజంగా అనారోగ్యంగా ఉన్నందున మధగజ రాజా ఈవెంట్ కి వెళ్లొద్దని మా తల్లిదండ్రులు నన్ను కోరారు. కానీ అద్దం చూసేసరికి డైరెక్టర్ సుందర్ సి ముఖం మాత్రమే కనిపించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫంక్షన్ కాబట్టి మిస్ కాకూడదని అనుకున్నాను. కాబట్టి, నేను ఈవెంట్ కోసం వచ్చానని" హీరో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో విశాల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే:

ఆదివారం జనవరి 5న జరిగిన మధగజ రాజా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విశాల్ హాజరయ్యారు. అక్కడ విశాల్ నడుస్తున్నప్పుడు సహాయకుడి మద్దతు తీసుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది.

అంతేకాకుండా విశాల్ మాట్లాడేటపుడు చేతులు వణుకుపోతుండటం అందరినీ షాక్ కలిగించింది. మైక్ కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా చర్చించుకున్నారు.ఇక తాజా విశాల్ మాటలతో హెల్త్ విషయంపై క్లారిటీ వచ్చింది.

మధగజ రాజా సినిమా:

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మధగజ రాజా సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో విశాల్ సరసన అంజలి నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించింది.

అయితే, ఈ చిత్రం 2012లో నిర్మాణాన్ని ప్రారంభించి 2013 నాటికి షూటింగ్ పూర్తిచేసుకుంది.కానీ, ఆర్థిక సమస్యల కారణంగా 12 ఏళ్లు గడిచిన విడుదలకు నోచుకోలేదు. ఇకపోతే ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలోకి వచ్చింది.