ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు లోనయ్యారు. బుధవారం(జులై 17) మధ్యాహ్నం సమయంలో ఆయన పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుండగా.. ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతుండంతో.. పీపుల్ స్టార్ ఫాన్స్‌ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.
Also Read :- ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత.. నిమ్స్ లో చికిత్స
తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు నారాయణ మూర్తి అభిమానులకు తెలియజేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే అభిమానుల ముందుకొస్తానని మాటిచ్చారు. కోలకున్నాక ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను నారాయణ మూర్తి వెల్లడించారు.