ఎన్టీపీసీ ప్రజల కోసం ఏదైనా చేయడానికి నేనున్నాను: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎన్టీపీసీ ప్రజల కోసం ఏదైనా చేయడానికి నేనున్నాను: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రామగుండం: ఎన్టీపీసీ ప్రజల కోసం ఏదైనా చేయడానికి తానున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. రామగుండం ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజాన్ పాండు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. రామగుండం ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. 

తన తాతయ్య, కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి  రామగుండంలో ఎన్టీపీసీ కంపెనీ ఫౌండేషన్ వేసి 40 సంవత్సరాలు పూర్తి అవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ ఈవెంట్లో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, దేశంలోనే అగ్రగామి ప్రాజెక్టు రామగుండం ఎన్టీపీసీ అని, దేశవ్యాప్తంగా వెలుగులు పంచుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

ALSO READ | ముంబైని దోచుకోవడానికే మోడీ వస్తుండు.. ఇక్కడ బీజేపీకి చోటు లేదు: CM రేవంత్

ఆటమ్ సోలార్ రూఫ్ కనిపెట్టినందుకు అమెరికా ప్రభుత్వం తనకు పేటెంట్ హక్కు కల్పించిందని తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్ ఇన్నోవేషన్కు గాను ఈ పేటెంట్ను అమెరికా పేటెంట్స్ ఇష్యూ చేసిందని వివరించారు. మన దేశంలో, ప్రపంచంలో కూడా ఎవరు కనిపెట్టలేదని ఈ సందర్భంగా చెప్పారు. ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషి, అంకితభావం వల్లనే ఈ ప్రాజెక్టు ఎన్నో ఘనతలను సాధించిందని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంపీ చెప్పారు. 

దేశవ్యాప్తంగా వెలుగులు పంచుతున్న ఎన్టీపీసీ, ‘నా ఎన్టీపీసీ.. నా రామగుండం’ అని తాను గర్వంగా చెప్పుకుంటున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ వేడుకలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదారు అరకల వేణుగోపాల్, ఐఎన్టియుసి జాతీయ నాయకులు బాబర్ సలీమ్ పాషా రామగుండం ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకున్నారు.