నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు.. కరీంనగర్ సభలో కేటీఆర్

నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు.. కరీంనగర్ సభలో కేటీఆర్

కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను కేసీఆర్ అంత మంచోణ్ని కాదని అన్నారు.   ప్రభుత్వం అణిచివేత అమలు చేస్తోందని, తమకు సమయం వస్తుంది.. అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తామని అన్నారు. 

ఈ సందర్భంగా ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందామని.. ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని అన్నారు బీజేపీ 1992లోనే ఒక్క ఓటు, రెండు రాష్ట్రాల పేరిట మోసం చేసిందని అన్నారు. 

దక్షిణ భారతానికి నష్టం వాటిల్లబోతోందని తమిళనాడు సదస్సు నిర్వహించిందని, కుటుంబ నియంత్రణ పాటించినందుకు దక్షాణాదిని బీజేపీ పాలకులు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో  అక్కడ సీట్లు తగ్గిస్తామంటోందని  అన్నారు. బీజేపీ నాయకులు అయోధ్య తలంబ్రాల పేరిట ప్రజలకు సెంటిమెంట్ పూశారని, అవి అయోధ్య వి కావని అన్నారు. 

బండి సంజయ్ ని ఏదడిగినా శివం, శవం ముచ్చట తప్ప వేరే లేదని.. బడి కట్టినా, గుడి కట్టినా బీఆర్ఎస్ నాయకులే కట్టారని తెలిపారు. బీఆర్ఎస్ మీద ద్వేషం, అసూయ అంశాలను ప్రయోగించి దుష్ప్రచారం చేశారని.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.