గోరఖ్ పూర్ నుంచి పోటీపై సీఎం యోగి రియాక్షన్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు గోరఖ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సబ్ కా సాథ్ సభ్ కా వికాస్ అనే మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు యోగి ఆదిత్యనాథ్. పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు. 

వచ్చే నెలలో జరగనున్న యూపీ అసెంబ్లీకి సంబంధించి 57 మంది కంటెస్టెంట్ల లిస్టును బీజేపీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఆ లిస్ట్‎లో సీఎం యోగి.. గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగుతారని ప్రకటించింది.