
దుబాయ్: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా 14 నెలలు ఆటకు దూరమైనా పట్టుదలతో జట్టులోకి తిరిగొచ్చి సత్తా చాటుతున్నాడు. 34 ఏండ్ల వయసులోనూ మంచి మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. రోజుకు ఒక్క పూటే భోజనం చేయడమేతన ఫిట్‌నెస్ రహస్యమని షమీ చెబుతున్నాడు. ‘2015 నుంచి నేను ఒక్క పూటే భోజనం చేస్తున్నా.
అది డిన్నర్ మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఏమీ ఉండదు. గత వన్డే వరల్డ్ కప్‌లో అయిన గాయం తర్వాత నుంచి కోలుకునే క్రమంలో 9 కిలోలు తగ్గాను. సర్జరీ తర్వాత నా బరువు 90 కిలోలకు పెరిగింది. అవసరం లేని పదార్థాలకు, స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉన్నా. బిర్యానీ మాత్రం అప్పుడప్పుడు తింటున్నా’ అని షమీ చెప్పుకొచ్చాడు.