నేతాజీ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి

నేతాజీ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. మన దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోడీ అన్నారు. నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. సుభాష్ చంద్రబోస్‎కు నివాళిగా గ్రానైట్‎తో తయారు చేసిన విగ్రహాన్ని కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అయితే గ్రానైట్ విగ్రహానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు హోలోగ్రామ్ విగ్రహం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. విగ్రహ ఆవిష్కరణ తర్వాత విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు మరియు సంస్థలు అందించిన సహకారం మరియు సేవలను గుర్తిస్తూ.. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అవార్డును అందజేయనున్నారు. ఈ వేడుకల్లో మొత్తం ఏడు అవార్డులను అందజేయనున్నారు. 2019, 2020, 2021 మరియు 2022 సంవత్సరాలకు సంబంధించి అవార్డులు అందించనున్నారు. అవార్డు దక్కించుకున్న సంస్థలకు సర్టిఫికేట్ తో పాటు రూ. 51 లక్షల నగదు బహుమతి ఇస్తారు.  అదేవిధంగా  వ్యక్తులకు అయితే రూ. 5 లక్షల నగదుతో పాటు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు.

సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. స్వేచ్ఛా భారత్ కోసం నేతాజీ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమంటూ ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు నేతాజీ జయంతి రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశభక్తి, ధైర్యం, నాయకత్వం, ఐక్యత మరియు సోదరభావానికి ఆయన ప్రతిరూపమని ఆమె కొనియాడారు. నేతాజీ తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారు.. నిలుస్తూనే ఉంటారని మమతా అన్నారు.

For More News..

సబ్బుల, షాంపూల ధరలు 20 శాతం పెరిగే అవకాశం